BREAKING: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు మృతి చెందినట్లు సమాచారం. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి మరణించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఆయన ఈ ప్రమాదంలో చనిపోయారని చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/05/The-president-of-Iran-died-in-a-helicopter-crash.jpg)
రైసీ ప్రయాణించిన చాపర్ కుప్పకూలిన ప్రాంతాన్ని గుర్తించింది రెస్క్యూ టీమ్స్. రైసీ ప్రయాణించిన హెలికాప్టర్..పూర్తిగా కాలిపోయింది. దీంతో ఇరాన్ అధ్యక్షుడు మృతి చెందినట్లు చెబుతున్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ… అజర్‌బైజాన్ పర్యటనకు వెళ్తుండగా జోల్ఫా సిటీ సమీపంలో వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలిపోయిందని సమాచారం. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.