హైదరాబాద్ మహా నగరంలో వాసులకు బిగ్ అలర్ట్. రామేశ్వరం కేఫ్‌కి తినడానికి వెళ్తున్నారా.. అయితే.. కాస్త జాగ్రత్త పడండి. నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని రామేశ్వరం కేఫ్ పై ఆరోపణలు వస్తున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే… నిన్న హైదరాబాద్ మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన తనికీల్లో విస్తుపోయే విషయాలు బైటకి వచ్చాయి.
అంతంత డబ్బులు పెట్టి తింటున్న నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారట. గడువు ముగుసిన 100 కేజీల మినపప్పు, 10 కేజీల పెరుగు, 8 లీటర్ల పాలు రామేశ్వరం కేఫ్ తనికీల్లో బైట పడ్డాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే..తప్పుగా లేబుల్ చేయబడిన ముడి బియ్యం (450 కేజీలు), వైట్ లోబియా (20 కేజీలు) విలువ రూ. 26వేలు స్వాధీనం చేసుకున్నారట. నందిని పెరుగు (10కిలోలు), పాలు (8లీటర్లు) విలువ రూ. 700 గల పదార్థాల గడువు ముగిసినట్లు గుర్తించారు అధికారులు. ఫుడ్ హ్యాండ్లర్‌లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవని… డస్ట్‌బిన్‌లకు మూతలు సరిగా లేవని అధికారులు తేల్చి కేసులు పెట్టారట.