పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని షూట్ చేయాలి : బుద్ధా వెంకన్న

-

మాచర్ల ఘటనపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని షూట్ చేయాలని డిమాండ్‌ చేశారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులను షూట్ చేయాలని వ్యాఖ్యానించారు. మాచర్ల ఘటనలో మొదటి బాధితుని తానేనని అన్నారు. జూన్ 4 తేదీ తర్వాత వైసీపీ కనుమరుగు అవుతుందని తెలిపారు.

Budda Venkanna

అటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నారా లోకేష్ అధ్యక్షుడుగా నియమించాలని డిమాండ్‌ చేశారు. లోకేషుని అధ్యక్షుడుగా నియమిస్తే మరో 30 ఏళ్లు పార్టీ బతుకుతుందని వెల్లడించారు. ఎన్నికల్లో 130 స్దానాలు కూటమికి వస్తాయని…అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం డేట్ భువ నేశ్వరి డిసైడ్ చేస్తారని కూడా తెలిపారు బుద్దా వెంకన్న.చంద్రబాబు ఆత్మ కధలో నా కో పేజీ ఉంటుంది….టిక్కెట్ కోసం రక్తంతో చంద్రబాబు కాళ్లు కడగలేదని వివరించారు. ఓడాక చాలా మంది పార్టీ వదిలి పారిపోయినా నేను నిలబడ్డానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news