భారత్‌లోని రైతులు రుతుపవనాల వర్షాలపైనే ఎక్కువగా ఆధారపడతారు. ఈ నేపథ్యంలో దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. మరో 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వెల్లడించింది .
రుతుపవనాల రాకకు పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేసింది. కేరళను తాకిన అనంతరం దేశమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, సహా పలు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది.మన దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలాన్ని నైరుతి రుతుపవనాల కాలంగా పేర్కొంటారు.