పౌరసరఫరాల శాఖలో అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలి : మహేశ్వర్ రెడ్డి

-

బీజేపీ ఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.సీఎం రేవంత్ రెడ్డికి 19 ప్రశ్నలతో లేఖ రాస్తే.. ఒక్క ప్రశ్నకు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పారని ఆయన అన్నారు.పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..తాను చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.”పైరవీ చేసి బీజేపీ ఎల్పీ పదవి తెచ్చుకున్నానని చేసిన వ్యాఖ్యలు సరికాదు అని అన్నారు. అందరి సమన్వయంతో నాకు బీజేపీ ఎల్పీ నేతగా అవకాశం కల్పించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మీరు పీసీసీ పదవి ఎలా తెచ్చుకున్నారో నాకు తెలియదా..? మీలా దిగజారి ఆరోపణలు చేయలేను అని ఫైర్ అయ్యారు.

ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్‌పై మాట్లాడినప్పుడు స్పందించని ఉత్తమ్ కుమార్ రెడ్డి.. యూ ట్యాక్స్‌పై మాట్లాడినప్పుడు మాత్రం స్పందించారంటే అవినీతి ఎంత జరిగిందో అర్థం అవుతోంది. పౌరసరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలి” అని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

.

Read more RELATED
Recommended to you

Latest news