తొలిసారి స్పందించిన హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ

-

రాసలీలల పెన్ డ్రైవ్‌ కేసు కర్ణాటకలో తీవ్ర దుమారం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారి స్పందించారు. మే 31వ తేదీ ఉదయం 10.00 గంటలకు సిట్ ముందు హాజరవుతానని వెల్లడించారు.

ఈ కేసులో తాను పోలీసులకు సహకరిస్తానని ,తనకు న్యాయవ్యవస్థలపైన చట్టాలపైన నమ్మకం ఉందని అన్నారు. అయితే తనపై తప్పుడు కేసుల పెట్టారంటూ ప్రజ్వల్ ఆరోపించారు. అలాగే ఈ ఆరోపణలన్నీ రాజకీయ కుట్రలో భాగంగానే వచ్చినవేనని అన్నారు. జేడీ(ఎస్) నాయకులు, పార్టీ కార్యకర్తలకు ఈ సందర్బంగా ప్రజ్వల్ క్షమాపణలు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల జరుగుతున్న వేళ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన రాసలీలల పెన్ డ్రైవ్ బయటపడ్డ విషయం తెలిసిందే.ఈ ఎన్నికల్లో జేడీఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ప్రతిపక్ష పార్టీలకు ఈ కేసు ప్రచారాస్త్రంగా మారింది .

 

Read more RELATED
Recommended to you

Latest news