పుణె కారు ఘటన.. మైనర్ బ్లడ్ శాంపిల్ స్థానంలో తల్లిది తీసుకొని..!

-

మహారాష్ట్రలోని పుణెలో టీనేజర్ కారు ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన నిందితుడైన మైనర్ను తప్పించేందుకు అతడి రక్త నమూనా పరీక్ష నివేదికను వైద్యులు మార్చేసినట్లు ఇదివరకు వెల్లడైన సంగతి తెలిసిందే.

తాజాగా అతడి బ్లడ్ శాంపిల్ను తన తల్లి రక్త నమూనాతో మార్చివేసినట్లు పోలీసులు వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ శ్రీహరి హల్నోర్‌ వాటిని తీసుకున్నట్లు తెలిపాయి. బ్లడ్‌ టెస్ట్ జరిగినప్పుడు మైనర్ తల్లి ఆసుపత్రిలో ఉన్నట్లు, వైద్య సిబ్బంది అరెస్టు తర్వాత నుంచి ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.  ప్రస్తుతం ఆమెకోసం గాలిస్తున్నారు.

మరోవైపు నిందితుడి రక్త నమూనాలు మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ శ్రీహరి హల్నోర్‌పై వేటుపడింది. సాసూన్‌ జనరల్‌ ఆస్పత్రి నుంచి అతడిని సర్వీసు నుంచి పూర్తిగా డిస్మిస్‌ చేసినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యూకేషన్‌ అండ్‌ రీసెర్చి ఆఫ్‌ మహారాష్ట్ర ప్రకటించింది. ఈ కేసులో ఉన్న ఫోరెన్సిక్‌ విభాగం అధిపతి డాక్టర్‌ తావ్‌డేపైనా సస్పెన్షన్‌ వేటు వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news