అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి

-

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి గన్‌ పార్క్‌ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన వారి సేవలను గుర్తు చేసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అమర వీరుల స్తూపానికి నివాళి అర్పించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కు చేరుకున్న రేవంత్ రెడ్డి అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత పరేడ్‌ గ్రౌండ్‌లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

మరోవైపు వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సాయంత్రం ట్యాంక్‌ బండ్‌పై ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళాబృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వేడుకలకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news