ఇప్పుడు లగ్జీరీకి సింబల్ విలువైన కార్లు.. కానీ ఒకప్పుడు గుర్రాలు.. గుర్రాలమీద రాజులు స్వారీ చేసేవాళ్లు. యుద్ధాలకు వెళ్లేవారు.. రాజులంటే కచ్చితంగా గుర్రాలు ఉండాల్సిందే. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా.. గుర్రాల మీద ఉన్న రాజుల విగ్రహాలు.. అన్ని రాజుల విగ్రహాల గుర్రాలు ఒకేలా ఉండవు. కొన్ని గుర్రాలు ఒక కాలు పైకెత్తి ఉంటాయి. కొన్ని ముందున్న రెండకాళ్లు ఎత్తి ఉంటాయి. ఇలా ఉండటం వెనుక పెద్ద మీనింగే ఉంది. వాటిని బట్టి ఆ రాజు ఎలా చనిపోయాడో చెప్పవచ్చట.. ఎలా అంటే..
రాజుల స్మృతి చిహ్నాలు ఉండే చోట.. చాలా చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేసి ఉంటారు కదా. గుర్రాల పై కూర్చుని ఉన్న విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తూనే ఉంటారు. చాలా విగ్రహాల్లో చేతిలో కత్తి, డాలుతో గుర్రం పై కూర్చుని పోరాడడానికి సిద్ధంగా ఉన్న సింహంలా కనిపిస్తూ ఉంటారు. అయితే, రాజుల స్టయిల్ ఇంచుమించు ఒకే విధంగా కనిపించినా.. వారు కూర్చున్న గుర్రపు విగ్రహం తీరు మాత్రం ఒకేలా ఉండదు. ఎందుకంటే, ఆ రాజులు ఎలా చనిపోయారో.. ఆ విగ్రహం చెబుతుంది కాబట్టి. ప్రతి విగ్రహంలోను గుర్రం స్టయిల్ భిన్నంగా ఉంటుంది. ఆ గుర్రం నుంచున్న విధానాన్ని బట్టి ఆ రాజు ఎలా చనిపోయారో చెప్పచ్చు.
రెండు కాళ్లు లేపి ఉంటే..
రాజు కూర్చున్న గుర్రం రెండు కాళ్లు గాల్లోకి లేపి ఉంటే ఆ రాజు యుద్ధం చేస్తూ.. కదనరంగంలోనే వీరమరణం పొందాడని అర్ధం.
ఒక కాలు మాత్రమే లేపి ఉంటే..
అదే ఆ గుర్రానికి ఒక కాలు మాత్రమే పైకి లేపి ఉంటే.. యుద్ధంలో బాగా దెబ్బలు తగిలి, ఆ గాయాల కారణంగా మరణించిన రాజులకు గుర్రాన్ని ఈ విధంగా చెక్కుతారు. మీరెప్పుడైనా రుద్రమ దేవి విగ్రహం గమనించారా..? ఆమె విగ్రహంలోని గుర్రానికి ఒక కాలు పైకి లేపి ఉంటుంది.. అంటే ఆమె యుద్ధంలో గాయపడి.. యుద్ధం ముగిసాక ఆ గాయాల కారణంగా మరణించింది. చివరిగా, అంబదేవునితో రుద్రమ దేవి యుద్ధం చేసింది. ఈ యుద్ధం లోనే గాయాల భారిన పడి.. కోలుకోలేక మృతి చెందింది. అలాగే, ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ సింగ్లు కూడా యుద్ధం తరువాత గాయాలతో బాధపడి మరణించారు
నాలుగు కాళ్లు నేల మీదే ఉంటే..
అదే గుర్రానికి రెండు కాళ్లు నేల మీదే ఉంటే.. ఆ రాజు సహజ మరణం పొందాడని అర్ధం. గుర్రాల వెనుక ఇంత పెద్ద కథ ఉందా.. ఈ సారి గమనించండి..!