నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. మోదీ హ్యాట్రిక్ కొట్టేనా?

-

యావత్‌ భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. మరికొన్ని గంటల్లో భారతదేశ భవిత్యం ఎవరి చేతిల్లోకి వెళ్లనుందో తెలియనుంది. రాబోయే ఐదేళ్లపాటు దేశ పాలనా పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారో తేలనుంది. 18వ లోక్‌సభ ఏర్పాటు కోసం మండుటెండల్లో రెండు నెలలకు పైగా సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి.

ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం (ఈసీ) పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన కనీస మెజార్టీ 272. గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 542 సీట్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలూ మంగళవారమే వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి అబ్ కీ బార్ చార్ సౌ పార్ నినాదంతో వచ్చిన బీజేపీ గెలుస్తుందా లేదా మోదీని గద్దెదించాలని ఏకమైన విపక్ష కూటమి ఇండియాకు ప్రజలు పట్టం కట్టారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news