సెలవులు తీసుకోవడంపై ట్విస్ట్ ఇచ్చారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్. తన సెలవును క్యాన్సిల్ చేసుకున్నారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్. సెలవుపై విదేశాలకు వెళ్లాలనుకున్న తన నిర్ణయాన్ని మార్చుకున్న సంజయ్….ఏపీలోనే ఉండనున్నారు. సీఐడీ చీఫ్ సంజయ్ కు విదేశాలకు వెళ్లేందుకు సీఎస్ అనుమతివ్వడంపై విమర్శలు వచ్చాయి.
ఇప్పుడు సంజయ్ తన సెలవుపై విదేశాలకు వెళ్లాలనుకున్న ప్రతిపాదనను వెనక్కు తీసుకోవడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. వాస్తవానికి సెలవులపై విదేశాలకు వెళ్లాలని అనుకున్నారు ఏపీ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్. ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలని అనుకున్నారు సంజయ్. సెలవుపై వెళ్లేందుకు సంజయ్ కు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. కానీ తన సెలవును క్యాన్సిల్ చేసుకున్నారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్.