NEET UG-2024 ఫలితాలపై కేంద్రం కీలక నిర్ణయం

-

NEET UG-2024 ఫలితాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలపడంతో వారికి మళ్లీ NEET పరీక్ష నిర్వహించనున్నారు. వారందరికీ జూన్ 23న మరోసారి ఎగ్జామ్ నిర్వహించి, జూన్ 30లోపు ఫలితాలను వెల్లడించనున్నారు.

Center’s key decision on NEET UG-2024 results

ఇవాళ నీట్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలింగ్‌పై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరణ తెలిపింది. ఎన్టీఏతో పాటు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ ఆదేశించింది సుప్రీం కోర్టు.

ఇప్పటికే నీట్‌పై కమిటీ వేసిన కేంద్ర ప్రభుత్వం.. 1563 మంది అభ్యర్థుల ర్యాంకులపై అనుమానాలు వ్యక్తం చేసింది. 1563 మంది ర్యాంకులను నిలిపివేశామని కోర్టుకు తెలిపంది ఎన్టీఏ. ఈ తరుణంలోనే.. గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలపడంతో వారికి మళ్లీ NEET పరీక్ష నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news