వాయనాడ్ ఎంపీగా బరిలో ప్రియాంక గాంధీ ?

-

తొలి సారి ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ నిలువబోతున్నారు. వాయనాడ్ లోక్ సభ స్థానం ఉప ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం అయ్యారట. వాయనాడ్ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాగా, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల విజయం సాధించారు. వాయనాడ్, రాయబరేలి రెండు చోట్ల విజయం సాధించారు రాహుల్ గాంధీ. కాగా, 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈనెల 24వ తేదీ నుంచి జులై 3వ తేదీ వరకు జరగనున్నాయి. తొలి విడత సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎంపికకు జరగనుంది. కొత్త లోక్‌సభ సభ్యుల ప్రమాణ కార్యక్రమం ఈసారి మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత స్పీకర్‌ ఎంపిక ఉంటుంది. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఈ నెల 26వ తేదీన జరగనుంది. 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇందుకోసం నామినేషన్లను స్వీకరించనున్నట్లు లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news