తమిళిసైకి అమిత్ షా వార్నింగ్.. అసలు మ్యాటర్ ఇదే

-

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మధ్య సీరియస్‌గా సంభాషణ సాగినట్లు కనిపించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాతోపాటు మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. అమిత్ షా తమిళిసైపై ఎందుకు సీరియస్ అయ్యారంటూ, తమిళిసైకి షా వార్నింగ్ ఇస్తున్నారంటూ ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇంతకీ ఈ ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారు? ఆ సమయంలో ఇంత సీరియస్‌ చర్చేంటి? అనే దానిపై తాజాగా తమిళిసై క్లారిటీ ఇచ్చారు.

‘‘లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీలో జరిగిన కార్యక్రమంలో తొలిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశాను. పోలింగ్‌ తర్వాత సమీకరణాలు, ఎన్నికల్లో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలుసుకునేందుకు అమిత్‌ షా నన్ను పిలిచారు. నేను ఆయనకు వివరిస్తున్నప్పుడు సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన మాట్లాడారు. రాజకీయ, నియోజకవర్గ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని సలహా ఇచ్చారు. ఆ మాటలు నాకు ఎంతో భరోసా కలిగించాయి. ఈ అంశం చుట్టూ తిరుగుతున్న అన్ని ఊహాగానాలకు ఇది స్పష్టత ఇస్తుంది’’ అని తమిళిసై అసలు సంగతి చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news