ఎన్టీపీసీ నుంచి 2,400 మెగావాట్ల కరెంటు కావాలా వద్దా? : కేంద్ర మంత్రి ఖట్టర్‌

-

విభజన చట్టం ప్రకారం రామగుండంలో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఎన్టీపీసీ నిర్మించే 2,400 మెగావాట్ల విద్యుత్కేంద్రం కరెంటు కావాలా.. వద్దా అని కేంద్ర విద్యుత్‌శాఖ కొత్త మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ రాష్ట్ర విద్యుత్‌శాఖను ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ  నిర్ణయం ఏంటో జులై ఆఖరులోగా తేల్చి చెప్పాలని సూచించారు. దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్కేంద్రాల నిర్మాణంపై ఆయన తాజాగా దిల్లీలో సమీక్ష జరిపారు.

ఈ సమీక్షలో రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించే కొత్తప్లాంటు గురించి లోతుగా చర్చ జరిగింది. ఉమ్మడి ఏపీ విభజన చట్టం ప్రకారం 4 వేల మెగావాట్ల ప్లాంటును తెలంగాణ కోసం ప్రత్యేకంగా నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే 1,600 మెగావాట్ల ప్లాంటును ‘తెలంగాణ విద్యుత్కేంద్రం’ పేరుతో రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించింది. దీన్నుంచి రోజుకు 3 కోట్ల యూనిట్ల కరెంటును తెలంగాణ సరఫరా చేస్తోంది. మిగిలిన 2,400 మెగావాట్ల ప్లాంటును కూడా నిర్మించనున్నామని, దీన్నుంచి ‘విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)’ చేసుకుంటారా.. లేదా.. చెప్పాలని గతంలో ఎన్టీపీసీ తెలంగాణ విద్యుత్‌శాఖకు లేఖ రాసింది.

Read more RELATED
Recommended to you

Latest news