ఐదు రోజుల్లోనే మూడు మ్యాచ్ లు… స్పందించిన రోహిత్ శర్మ

-

టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా సూపర్-8 పోరును అఫ్గానిస్థాన్‌తో గురువారం నుంచి ప్రారంభించనుంది.ఇప్పటివరకు యూఎస్‌ఏ పిచ్‌లపై ఆడిన భారత్ .. ఇప్పుడు వెస్టిండీస్ వేదికగా జరిగే మ్యాచుల్లో తలపడనుంది.5 రోజుల వ్యవధిలో మూడు మ్యాచులు ఆడటంపై సారధి రోహిత్ శర్మ స్పందించాడు.

తక్కువ రోజుల్లోనే ఎక్కువ మ్యాచులు ఆడడంను తాము సాకుగా చూపమని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఇప్పటివరకు నాణ్యమైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలమైన విరాట్ కోహ్లీ సూపర్‌-8 కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు అని తెలిపారు. బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌ సాధన చేస్తున్న వీడియోలు నెట్టింట్లా వైరల్‌గా మారాయి. అతడితోపాటు స్పిన్నర్స్ కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజాకూడా నెట్స్‌లో విపరీతంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. విండీస్‌లో స్పిన్నర్లు కీలకంగా మారే అవకాశం ఉంది. సూపర్‌-8లో భాగంగా టీమ్‌ఇండియా అఫ్గాన్‌తో జూన్ 20న, బంగ్లాదేశ్‌తో జూన్ 22న, ఆస్ట్రేలియాతో జూన్ 24న తలపడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news