రుషికొండ భవనాలపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

-

రుషికొండ భవనాలపై దుష్ప్రచారం చేస్తున్నారని…అందులో ప్రజాధనం ఎక్కడా వృధా కాలేదని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఇవాళ మీడియాతో మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ… త్వరలోనే టీడీపీ శ్రేణులు దాడులు చేసిన వారిని జగన్ పరామర్శిస్తారని వెల్లడించారు. నియోజక వర్గాల్లో వారం రోజుల పాటు నేతల పర్యటనలు ఉంటాయన్నారు. ఓటమి ఒక మిరాకిల్ మాదిరి ఉందని… ఇంత మంచి చేసినా ఓటమి పాలవటం నమ్మశక్యంగా లేదని వివరించారు మాజీ మంత్రి కొడాలి నాని.

Kodali Nani’s sensational comments on Rushikonda buildings

చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహించారు. 1500 మహిళలకు ఫించన్, 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు అంశాల గురించి చంద్రబాబు మాట్లాడటం లేదని ఫైర్‌ అయ్యారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ నెల ఒకటో తేదీన అమలు చేస్తారా లేదా ఇప్పటికే క్లారిటీ లేదని ఆగ్రహించారు మాజీ మంత్రి కొడాలి నాని. పోలవరం, అమరావతి పేరుతో హామీలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు… సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news