BREAKING: విశాఖలోనూ వైసిపి కార్యాలయానికి నోటీసులు..అది కూడా కూల్చుతారా !

-

Notices to YCP office in Visakha: ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి మరో షాక్‌ తగిలింది. విశాఖలోనూ వైసిపి కార్యాలయానికి నోటీసులు జారీ అయ్యాయి. ఎండాడ లోని సర్వే నంబర్ 175/4 లో 2 ఎకరాలలో స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని అభ్యంతరం తెలుపుతున్నారు జీవీఎంసీ అధికారులు.

Notices to YCP office in Visakha too

జీవీఎంసీ నుంచి కాకుండా అనుమతులు కోసం వీఎంఆర్డీఏకు దరఖాస్తు చేయడం, అక్కడా అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడం పై వివరణ కోరింది జీవీఎంసీ. వారం లోపు సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయంటూ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి నోటీసు అంటించారు జోన్ 2 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్.

అటు తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కక్ష సాధింపు చర్యలను చంద్రబాబు మరొస్తాయికి తీసుకెళ్లారని అసహనం వ్యక్తపరిచారు.కాగా వైసీపీ కార్యాలయాన్ని ఈరోజు తెల్లవారుజామున సీఆర్‌డీఏ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.దీనిపై తాజాగా మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ ఎక్స్ వేదికగా స్పందిoచారు.ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని,హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారని ట్విట్టర్లో మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news