వచ్చే నెల నుంచి గురుకులాలకు కొత్త టీచర్లు

-

తెలంగాణ గురుకులాలకు వచ్చే నెల నుంచి కొత్త టీచర్లు రానున్నారు. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలకు కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు జులై నుంచి బోధన ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులకు(ఆర్ట్, క్రాఫ్ట్‌ టీచర్లు మినహా) ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగుల ప్రక్రియ చేపట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ సంక్షేమ గురుకుల సొసైటీలు కార్యాచరణ సిద్ధం చేశాయి. ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల మొదటి వారంలోపు పోస్టింగుల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ నెల 23న వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ ప్రకటించింది. ఆయా జోన్లు, మల్టీజోన్లలో ఖాళీల మేరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి ఈ నెల 25న పోస్టింగ్‌ ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించింది. సీనియారిటీ జాబితాలను ఇప్పటికే రూపొందించగా.. వాటిపై అభ్యంతరాలు తీసుకుని జులై మొదటి వారంలో వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాయి. అనంతరం పదోన్నతులు పొందిన వారికి పోస్టింగు ఇస్తాయి. ఈ ప్రక్రియ మొదటి వారానికి పూర్తిచేసి కొత్తగా ఎంపికైన వారికి పోస్టింగు ఉత్తర్వులు ఇవ్వనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news