Backlash to former CM KCR in High Court: తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్‌ను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. ఈ మేరకు పిటీషన్ వేశారు కేసీఆర్.
అయితే.. ఆ పిటీషన్ పై విచారణ చేసిన మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్‌ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు.. విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. ప్రభుత్వ వాదనలను సమర్థించిన హైకోర్టు..మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలను సమర్థించిన హైకోర్టు…కేసీఆర్ పిటిషన్‌ను కొట్టివేసింది.
కాగా, విద్యుత్ కమిషన్ పదవీ కాలం పొడిగింపు పై సందిగ్ధత కొనసాగుతోంది. జూన్ 30తో ముగిసింది ఎల్. నరసింహరెడ్డి కమిషన్ వ్యవధి. ఇంకా విచారణ దశలోనే కమిషన్ ఉంది. ఇప్పటికే 25 మందిని విచారించిన విద్యుత్ కమిషన్… తుది నివేదిక ఇవ్వడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. కమిషన్ పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తుందా?లేదా అనే అంశంలో లేని స్పష్టత రావాల్సి ఉంది.