నీట్-పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ముహుర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో నీట్-పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను ఎన్టిఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాయిదా పడ్డ ఈ పరీక్షను ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖ నిర్వహించిన భేటీలో ఆరోగ్యశాఖ, సైబర్ సెల్, ఇతర అధికారులు, ప్రతినిధులు పరీక్ష సన్నద్ధతపై చర్చించారు. కాగా పరీక్ష పత్రాన్ని ఎగ్జామ్ నిర్వహించే రెండు గంటల ముందు రూపొందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాగా, నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జులై 4న దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. అసమర్ధంగా పరీక్షలు నిర్వహిస్తున్న NTAను రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులంతా బంద్ లో పాల్గొని, తరగతులు బహిష్కరించి ర్యాలీలు, నిరసనలు చేయాలని కోరాయి.