టాలీవుడ్ స్టార్ హీరో విక్టరి వెంకటేష్ తన నెక్ట్స్ మూవీని డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఎఫ్-2, ఎఫ్-3 చిత్రాలతో సక్సెస్ ఫుల్ కాంబోగా మారిన ఈ ఇద్దరు, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్నారు. జూలై 3న ఈ సినిమాను ప్రారంభించనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేయగా.. తాజాగా ముహూర్త సమయాన్ని కూడా ప్రకటించారు.
అయితే… విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ విషయాన్ని మూవీ టీం తాజాగా ప్రకటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమం రేపు జరగనుంది. వెంకీ మామ, డైరెక్టర్ అనిల్ కలిసి ఇప్పటికే ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.