చిన్నారి కోసం కాన్వాయ్ ఆపిన పవన్ కళ్యాణ్‌ !

-

చిన్నారి కోసం కాన్వాయ్ ఆపారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి మంచి మనసును చాటుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం యు. కొత్తపల్లి మండలం ఉప్పాడలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా.. ఓ చిన్నారి జనసేన జెండాతో రోడ్డుపై కనిపించింది.

Pawan Kalyan Stops Convoy For Small Kid

వెంటనే తన కాన్వాయ్ ఆపి ఆప్యాయంగా పలకరించారు. అనంతరం చిన్నారితో ఫొటో దిగారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు పిఠాపురం ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్‌న్యూస్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసారి పిఠాపురంలో పర్యటించారు. పిఠాపురంలో పవన్‌ అడుగుపెట్టడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. పిఠాపురంలో స్థలం కోసం చూస్తున్నానని.. ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news