చంద్రబాబు 4 వేల పెన్షన్ ఇస్తుంటే.. రేవంత్ కు చేత కావడం లేదని ఆగ్రహించారు మాజీ మంత్రి హరీష్‌రావు. దుబ్బాకలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమంలో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదు… ఏడు నెలల్లో తెలంగాణలో పల్లెలన్ని మురికి కూపాలుగా మారాయని ఆగ్రహించారు.
గ్రామపంచాయితీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడం లేదు… పాలన గాలికొదిలేసి ప్రతిపక్షాల మీద కుట్రలు చేసి ప్రతికారం తీర్చుకోవడానికి కేసులు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు వేలు పెన్షన్ ఇస్తుంటే ఇక్కడి సీఎంకి రెండు వేలు ఇవ్వడం కూడా చేత కావడం లేదు… పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోనే బీఆర్ఎస్ పార్టీకి దుబ్బాకలో అత్యధిక మెజార్టీ వచ్చిందని వివరించారు.
ఖమ్మం జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు… సీఎం సొంత జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగాడని ఇప్పుడే తెలిసిందని పేర్కొన్నారు. కాలం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది.. ఎన్నికలు రాక తప్పదు బీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా ఉండదని ధీమా వ్యక్తం చేశారు.