కాంగ్రెస్‌లో చేరికపై గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన

-

బీఆర్ఎస్‌కు మరో షాక్ తగలనుంది. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అనుచరులతో వెల్లడించారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి చేరికను గద్వాల జడ్పీ చైర్‌పర్సన్ సరితా తిరుపతయ్య సహా పలువురు స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో సరితకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

BRS MLA Krishnamohan Reddy

అటు గద్వాల పంచాయితీ తారా స్థాయికి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య. గద్వాల బిఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు లోకల్ నేతలు. నిన్న గద్వాల లో సెల్ టవర్ ఎక్కడం, పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరికలు చేశారు సరిత అనుచరులు. అటు జీవన్ రెడ్డి మరోసారి మనస్తాపానికి గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news