హరహరే మైదానంలో జింబాబ్వేతో జరుగుతున్న తొలి t20 లో టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగారు.
ముఖ్యంగా రవి బిష్ణోయ్ స్పిన్ మంత్రంతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 115 రన్స్ చేసింది. క్లైవ్ మదాండే(25 నాటౌట్) 3 పోరాటంతో ఆ జట్టు కష్టంగా 100 రన్స్ ను దాటింది. డియోన్ మైయర్స్ (23), బ్రియాన్ బెన్నెట్(23), వెస్లీ మాథెవెరే(21), కెప్టెన్ సికందర్ రజా(17) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. నలుగురు ప్లేయర్లు డకౌట్ అయ్యారు.రవి బిష్ణోయ్ 4 వికెట్లతో విజృంభించాడు.అతనికితోడు స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో భారత్ ముందు జింబాబ్వే 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.టీమిండియా బౌలర్లలో సుందర్ 2, అవేశ్, ముకేశ్ తలో వికెట్ల తీశారు.