ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో ఓ యువకుడిని నెల రోజుల్లో ఐదుసార్లు పాముకాటు వేసిన వింత ఉదంతం చోటు చేసుకుంది. చికిత్స తరువాత తరువాత ప్రతీసారి యువకుడు కోలుకున్నాడు. పాముకాటుకు గురైన యువకుడు మళ్లీ మళ్లీ ఎలా కోలుకుంటున్నాడో చికిత్స అందిస్తున్న వైద్యులు సైతం ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. పాము భయంతో ఆ యువకుడు తన ఇంటిని వదిలీ అత్త వద్ద నివాసం ప్రారంభించడం గమనార్హం. ఆ పాము అతడినీ అక్కడ కూడా వదలలేదు. యువకుడితో పాటు అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
యూపీలోని ఫతేపూర్ జిల్లా మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌరా గ్రామంలో వికాస్ దూబే(24) నివసిస్తున్నాడు. జూన్ 02, జూన్ 10న, జూన్ 17, జూన్ 24, జూలై 05 ఇలా అతడిని ఐదుసార్లు కాటు వేసింది పాము. వికాస్ అత్త ఇంట్లో నివసించడానికి వెల్లాడు. అక్కడ కూడా పాము వదలలేదు. ఈ ఘటన పై జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు భవిష్యత్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయేమోనని కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.