ఆయన తాన అంటే.. రేవంత్ రెడ్డి తందానా అంటున్నాడు : కొప్పుల ఈశ్వర్

-

తెలంగాణలో బీజేపీకి ప్రజలు 8 మంది ఎంపీలను గెలిపిస్తే.. బీజేపీ ఇచ్చే తొలి రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పెద్దపల్లిలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బొగ్గు గనుల వేలానికి అభ్యంతరం చెప్పాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీని ఆహ్వానిస్తున్నాడని మండిపడ్డారు.మోదీ తాన అంటే.. రేవంత్ రెడ్డి తందానా అంటున్నాడని ఫైర్ అయ్యారు. వేలం వేయడం మంచిదే అని కేంద్రానికి మద్దతు ప్రకటిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి వేలాన్ని వ్యతిరేకిస్తూ మోదీకి లేఖ రాశారని.. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రధానికి ఎందుకు లేఖ రాయడం లేదని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.

బొగ్గు బావుల వేలం వద్దని ఎందుకు విజ్ఞప్తి చేయట్లేదని ,స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేపు వేలం కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని.. వేలంలో పాల్గొనడం అంటే.. బొగ్గు బావుల మీద సింగరేణి హక్కులేదని అని ఒప్పుకోవడమేనని అన్నారు.సింగరేణి కార్మిక సంఘాలు కూడా ఈ విషయంలో స్పందించానలని అన్నారు. గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ, ప్రభుత్వం తీరుపై మిత్రపక్షం సీపీఐ నేతలు ఏమంటారో చెప్పాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news