కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, తెలంగాణ ఉద్యమకారుడు అద్దంకి దయాకర్ హీరోగా పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అద్దంకి దయాకర్ సరసన సీనియర్ నటి ఇంద్రజ నటిస్తున్నారు. బొమ్మకు క్రియోషన్స్ పతాకంపై బొమ్మక్ మురళి దర్శకత్వంలో వహిస్తున్న ఈ మూవీ ఐదు భాషల్లో నిర్మిస్తున్నారు. బయోవార్, దేశ సమస్యలు, సామాజిక అంశాలు ఈ మూవీలు ఉంటాయని గతంలోనే హీరో అద్దంకి దయాకర్ ప్రకటించారు. ఈ మూవీలో అద్దంకి దయాకరే కాకుండా బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నాయకులు నటిస్తున్నారు. ప్రజా యుద్ధ నౌక, గాయకుడు, రచయిత గద్దర్, సీనియర్ నటుడు శుభలేక సుధాకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని సమాచారం.
ఈ మూవీపై హీరో అద్దంకి దయాకర్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఈ ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జూలై 10న ప్రసాద్ ల్యాబ్లో చిత్రబృందం నిర్వహిస్తోందని ప్రకటించారు. ఫ్రాన్ ఇండియాగా ఐదు భాషల్లో తెరకెక్కుతున్న
ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు భాషలో ఆడియో విడుదల కార్యక్రమానికి శ్రేయోభిలాషులందరరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు అద్దంకి తెలిపారు. ఈ సినిమాకు ‘ఇండియా ఫైల్స్’ పేరును ఖరారు చేసినట్లు చిత్ర హీరో దయాకర్ చెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం తన ఫేస్ బుక్ పేజీలో ‘ఇండియా ఫైల్స్’ పోస్టర్ ని పోస్ట్ చేశారు. భారతదేశ CULTURAL DNA పై విడుదల కాబోతున్న భారతదేశపు తొలి సినిమా ‘ఇండియా ఫైల్స్’ అంటూ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.