అంగన్వాడి కేంద్రాలకు వచ్చే చిన్నారులకు త్వరలో యూనిఫాంలు : మంత్రి సీతక్క

-

సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి దనసరి సీతక్క సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్ల పనితీరు, అందుతున్న సేవలపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు.ఈ సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ‘అమ్మ మాట- అంగన్‌వాడీ బాట’ పేరుతో ఈ సోమవారం నుంచి వారం రోజులపాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆమె సూచించారు.తొలి ఒడి అమ్మ అయితే మలి ఒడి అంగన్వాడి కేంద్రాలే అని మంత్రి అన్నారు .పిల్లలకు ఆరోగ్యము, పోషకాహారము, భద్రత కల్పించే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలు పనిచేయాలని తెలిపారు. మీ పిల్లల భద్రత మా బాధ్యత అనే నమ్మకాన్ని తల్లిదండ్రుల్లో కలిగించేలా అంగన్వాడీ కేంద్రాలు పని చేయాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన వస్తువులు అందేలా జిల్లా సంక్షేమ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని,నాసిరకం వస్తువులు వస్తే అంగన్వాడీ టీచర్లు తిరస్కరించాలని.. నాసిరకం సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు .అంగన్వాడి కేంద్రాలకు వచ్చే చిన్నారులకు త్వరలో యూనిఫాంలు అందజేయబోతున్నామని తెలిపారు. దత్తత ప్రక్రియను కూడా సులభతరం చేశామని మంత్రి సీతక్క వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news