వైద్యారోగ్య శాఖ మంత్రి అధ్యక్షతన జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

-

వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు,మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌ బాబు, శివశంకర్ (రిటైర్డ్ ఐఏఎస్), జీఏడి అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త చేసుకున్న దరఖాస్తులపై సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది . కేబినెట్ సబ్ కమిటీకి చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖాధిపతులకు పంపించాల్సిందిగా కేబినెట్ సబ్ కమిటీ జీఏడి అధికారులను ఆదేశించింది. మిగతా దరఖాస్తులను వివిధ శాఖలకు పంపి వాటిని పరిశీలన చేసిన తర్వాత తిరిగి కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావాలని ఈ సమావేశంలో నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news