వరంగల్ దంపతుల హత్య కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు

-

ప్రేమ వివాహం చేసుకుని అనంతరం పెద్ద మనుషుల సమక్షంలో విడిపోయిన యువతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే కోపంతో ఓ వ్యక్తి ఉన్మాదిగా మారి ఆ యువతి తల్లిదండ్రులకు హత్య చేశాడు. అడ్డువచ్చిన ఆమె, ఆమె సోదరుడిపై కూడా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారు చింతల్‌తండాలో ఈ దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హత్య అనంతరం పరారైన నిందితుడు బన్నీని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే?.. తండాకు చెందిన బానోతు శ్రీనివాస్‌ (45), సుగుణ (40) దంపతుల కుమార్తె దీపిక (21), గుండెంగ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ మేకల నాగరాజు అలియాస్‌ బన్నీ గత ఏడాది నవంబరులో హైదరాబాద్‌ వెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కుమార్తె తల్లిదండ్రులు తమ కుమార్తెకు కౌన్సెలింగ్‌ ఇప్పించాల్సిందిగా కోరుతూ ఈ ఏడాది జనవరిలో చెన్నారావుపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాగరాజు, దీపికలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ చేశారు. శ్రీనివాస్, సుగుణ దంపతులు దీపికకు నచ్చజెప్పడంతో వారితో కలిసి ఇంటికి వచ్చేందుకు ఆమె అంగీకరించింది. రెండు నెలల క్రితం గుండెంగకు వచ్చిన నాగరాజుకు.. దీపికకు ఆమె తల్లిదండ్రులు మరో పెళ్లి సంబంధం చూస్తున్నట్లు అతనికి తెలిసింది. దీంతో అతను గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో వేట కొడవలి తీసుకొని యువతి ఇంటికి వెళ్లి శ్రీనివాస్, సుగుణలపై విచక్షణ రహితంగా దాడి చేసి హతమార్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news