కువైట్‌లో కష్టాలు పడుతున్న శివ అనే కార్మికుడు తన గోడును ఏపీ ప్రభుత్వానికి విన్నవించుకున్న విషయం తెలిసిందే. ఆయణ్ను కాపాడతానని ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించిన విషం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ కార్మికుడిని ఇండియన్ ఎంబసీ కాపాడింది. అతడిని త్వరలోనే రాష్ట్రానికి తీసుకొస్తామని ఏపీ మంత్రి లోకేశ్ అన్నారు.
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. అక్కడి ఎడారిలో జన సంచారం లేని ప్రాంతంలో కోళ్లు, గొర్రెలు, పావురాలు, బాతుల్ని మేపే పనిలో ఆయన్ను పెట్టిన యజమానులు నాలుగు రోజులైనా అక్కడికి రాకపోవడం.. సరిపడా ఆహారం, నీటిని అందించకపోవడంతో బాధితుడు భయపడిపోయారు. ఈ తరుణంలో తన భార్యకు, ఏజెంటుకు సమాచారం అందించారు. అక్కడ పని చేయాల్సిందేనని ఏజెంట్ స్పష్టం చేశాడు. చేసేది లేక తన కష్టాలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు.