సౌత్ అమెరికా ఖండం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడవులకు ప్రసిద్ధి. అక్కడి అడవుల్లో రకరకాల జీవులు ఉంటాయి. అరుదైన జంతువులు కూడా ఆ అడవుల్లో దర్శనమిస్తాయి. అక్కడ అరుదైన జంతువులతో పాటు అరుదైన ట్రైబల్స్ కూడా ఉన్నారని చెబుతున్నారు పరిశోధకులు. కానీ సరైన ఆధారాలు ఎప్పుడూ కనిపించలేదు.
తాజాగా అమెజాన్ అడవుల్లో సంచరించే అరుదైన తెగకు సంబంధించి ఫోటోలు, వీడియోలు ఫస్ట్ టైం సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ తెగను మాష్కో పైరోగా గుర్తించారు. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా నివసించే గిరిజన తెగల్లో ఇదే అతి పెద్ద తెగగా వర్ణిస్తున్నారు. పెరూ దగ్గరలోని లాస్ పిడ్రాస్ నది సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు. అయితే వీరు ఆటలు ఆడుతున్నారా? జంతువుల వేట కోసం అక్కడికి వచ్చారా? అనేది క్లారిటీ లేదు.వీళ్ళని చూస్తుంటే మనం సైన్స్, చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకున్న మాదిరిగా కనిపించారు.
ఈ మాష్కో పైరో తెగకు చెందిన మనుషుల ఒంటిపై దుస్తులు లేవు. కాకపోతే కర్రలతో తయారు చేసిన ఈటె వారి ఆయుధంలా తెలుస్తుంది. వీళ్ళు నది ఒడ్డున పదుల సంఖ్యలో కనిపించారు. ఇక వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ సంస్థ X లో విడుదల చేసింది.ఈ ప్రాంతాన్ని పరిరక్షించడంలో అక్కడి ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని ఆరోపిస్తున్నాయి పలు విదేశీ సంస్థలు. కొన్ని కంపెనీలకు ఆ ప్రాంతాన్ని విక్రయించినట్టు చెబుతున్నాయి.
మారుమూల గ్రామాలయిన మోంటే సాల్వడో, ప్యూర్టో న్యూవో దగ్గరలో ఈ తెగ ఆహారం కోసం అన్వేషణ చేస్తూ కెమెరాకు చిక్కారని తెలుస్తుంది. ఈ తెగ బయటకు రావడంతో వారి గురించి కొత్త విషయాలు తెలిసే అవకాశముంది. అంతేగాక బ్రెజిల్ సరిహద్దులో కూడా మాష్కో పిరో తెగ కనిపించిందని అంటున్నారు. అక్కడ వాతావరణం కాస్త వేడిగా ఉన్న సమయంలో ఆ తెగకి చెందిన వ్యక్తులు తాబేలు గుడ్ల కోసం అక్కడికి వస్తారని సమాచారం తెలుస్తుంది. అప్పుడు మాత్రమే ఇసుక మీద వారి పాద ముద్రలు కనిపిస్తాయట. పైగా ఆ నది ఒడ్డున చాలా వరకు తాబేలు పెంకులు వుంటాయని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
❗️ New & extraordinary footage released today show dozens of uncontacted Mashco Piro Indigenous people in the Peruvian Amazon, just a few miles from several logging companies.
Read the news: https://t.co/g9GrZlf3XB pic.twitter.com/fZv5rryzVp
— Survival International (@Survival) July 16, 2024