హరీష్ రావు రాజీనామా సవాల్.. సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే..!

-

తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో ఈ పథకంను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావుపై పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.

పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని సవాలు విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘సవాలు చేసిన వారిని రాజీనామా చేయమని మేం అడగం. మీరెలాగూ పారిపోతారని మాకు తెలుసు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అని అన్నారు. సోనియా, రాహుల్ గాంధీ మాట ఇస్తే అది శిలాశాసనం. దాన్ని తప్పరు. గాంధీ కుటుంబం రాజకీయ ప్రయోజనాలకోసం మాట ఇవ్వదు’ అని ఆయన స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news