తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద.. 24 గేట్లు ఎత్తివేత

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వానకు, ఎగువ నుంచి వస్తున్న వరదకు జిల్లాలోని పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఇందులో భాగంగానే చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువన ఉన్న చత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈరోజు 24 గేట్లు ఎత్తి 59 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువన గోదావరికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి 60,297 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. క్రమేపీ వరద ఉద్ధృతి పెరుగుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ ఉపేందర్ తెలిపారు. మరో పక్క చింతవాగు, పగిడి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

ఇంకోవైపు జిల్లాలోని అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గురువారం రాత్రి భారీ గండి పడింది. దీంతో నీళ్లన్నీ దిగువకు వెళ్లడంతో ప్రాజెక్టు ఖాళీ అయింది. ప్రాజెక్టు కట్ట తెగి వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. వరద ప్రవాహానికి వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. ఇంకోవైపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం 26 అడుగుల మేర నీటిమట్టం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news