రాజకీయ విమర్శలు కట్టిపెట్టి కాళేశ్వరాన్ని పునర్ వినియోగంలోకి తేవాలి : హరీష్ రావు

-

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్లు కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ నిధులను ఎక్కువగా ఖర్చుపెట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై మంత్రి చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు ఖండించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..” మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ విమర్శలు కట్టిపెట్టి కాళేశ్వరాన్ని పునర్ వినియోగంలోకి తేవడంపై శ్రద్ధ పెట్టాలి అని హితవు పలికారు. ఢిల్లీ వేదికగా ఆయన తన అవగాహనా రాహిత్యాన్ని బయట పెట్టుకున్నారు అని విమర్శించారు. మేడిగడ్డ వద్ద అన్ని చర్యలు తీసుకున్నామని అంటూనే మట్టి పరీక్షలు సాధ్యపడలేదని చెప్తున్నారు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వరద రాకముందే సాంకేతిక పరీక్షలు పూర్తి చేయకపోవడానికి NDSA నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యమే కారణం అని అన్నారు. వరదల దృష్ట్యా పరీక్షలు ఆపేశామని చెప్పడం బాధ్యత రాహిత్యానికి నిదర్శనం కాదా?. రక్షణ కోసం సూచనలు చేయడంలో NDSA దారుణంగా విఫలం అయింది అని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news