స్మిత అగర్వాల్ పై బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు..క్షమాపణ చెప్పాల్సిందే ?

-

స్మిత అగర్వాల్ పై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీమతి స్మిత అగర్వాల్ దివ్యాంగుల పట్ల చేసిన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలు దివ్యాంగుల మనోభావాలను, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవి. ఇవి సభ్య సమాజానికి మంచివి కాదని తెలిపారు.

laxman slams smitha sabarwal

సభ్య సమాజంలో గౌరవప్రదంగా ఉండాలని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో 2016లో వికలాంగుల అనే పదాన్ని తీసేసి దివ్యాంగులు అనే గౌరవ ప్రధంగా దేశ ప్రజలు గౌరవించాలని చట్టం తీసుకురావడం జరిగింది. వారిలో దివ్యాంగులు అనే పదం వారి మనోబలాన్ని పెంచిందని వెల్లడించారు. దివ్యాంగులు భారత సమాజంలో అభివృద్ధిలో వారి పాత్ర ప్రముఖమైనది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా దివ్యాంగులు తమ ప్రతిభను మేధస్సును ఉపయోగించి ఎన్నో దేశ ప్రయోజనకరమైనటువంటి సంబంధాల్లో భాగం పంచుకున్నారని తెలిపారు.

దివ్యాంగుల పట్ల శ్రీమతి స్మిత అగర్వాల్ చేస్తున్న ట్వీట్ పట్ల సభ్య సమాజం ఆందోళనతో ఉన్నది. వెంటనే ఉపసంహరించుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విషయంపై స్పందించి ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారి పైన తగిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news