Telangana: మద్యం ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని బెల్ట్ షాప్ యజమాని సూసైడ్ యత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నాకు మద్యం ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఎలుకల మందు తాగాడు బెల్ట్ షాప్ యజమాని.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియ్యాపూర్కు చెందిన ఓ బెల్టు షాపు నిర్వాహకుడు సుల్తానాబాద్ వైన్స్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి గ్రామంలో విక్రయిస్తుంటాడు. అయితే కొద్దిరోజులుగా వైన్స్ షాప్ నిర్వాహకులు అందరూ సిండికేట్ అయి బెల్టు షాపులకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నరు. నేను తీవ్రంగా నష్టపోతున్న. బాధ భరించలేక కూల్డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్మ చేసుకుంటున్న అని చెప్పిన సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://x.com/TeluguScribe/status/1815591741686460678