హమాస్ తో యుద్ధానికి మద్దతివ్వండి.. అమెరికా కాంగ్రెస్‌లో ఇజ్రాయెల్ ప్రధాని ప్రసంగం

-

అమెరికా పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అక్కడి కాంగ్రెస్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా హమాస్‌తో పోరాటానికి మద్దతివ్వాలని అమెరికా కాంగ్రెస్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. హమాస్‌తో పోరాటంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పని చేయాలని అన్నారు. ఆందోళనకారుల నిరసనల మధ్యే ఆయన ప్రసంగం కొనసాగింది. అయితే 50 మంది డెమోక్రాట్లు నెతన్యూహు ప్రసంగాన్ని బహిష్కరించారు. నెతన్యాహు రాకతో వేలాది మంది నిరసనకారులు క్యాపిటల్ హిల్ చేరుకుని ఆందోళనకు దిగారు.

ఇది జాతుల మధ్య యుద్ధం కాదని.. ఆటవికానికి, నాగరిక సమాజానికి మధ్య యుద్ధం అని నెతన్యాహు అభివర్ణించారు. మన ప్రపంచం ఉపద్రవంలో ఉందని.. అందుకే ఇజ్రాయెల్‌వైపు అమెరికా నిలవాలని కోరారు. పశ్చిమాసియాలో ఇరాన్‌ ఉగ్రవాద చర్యలు అమెరికా, ఇజ్రాయెల్, అరబ్‌ స్నేహదేశాలకు ఇబ్బందికరంగా మారాయని.. తన దేశాన్ని రక్షించుకునేందుకు, తన దేశ ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చానని నెతన్యాహు పేర్కొన్నారు. మరోవైపు ఇవాళ బైడెన్‌, కమలా హారిస్‌తో ఆయన భేటీ కానున్నారు. శుక్రవారం రోజున మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news