రుణమాఫీతో రైతులకు కొత్త సమస్యలు : హరీశ్ రావు

-

తెలంగాణ ప్రభుత్వం రైతులకు మాట ఇచ్చినట్లుగా రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించింది. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తూ నిధులు విడుదల చేసింది. మూడు విడతల్లో రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేయనుంది. అయితే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ అని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు మొదట లక్ష రూపాయలే మాఫీ చేస్తాననడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు రుణమాఫీపై తీవ్రంగా స్పందించారు. తాజాగా మరోసారి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఈ విషయంపై మాట్లాడారు.

డిసెంబర్ 9వ తేదీన రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ సర్కార్ మాట తప్పిందని హరీశ్ రావు మండిపడ్డారు. 7 నెలల తర్వాత ఆ ప్రక్రియ ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురువుతున్నాయని అన్నారు. ముందుగా ఏడు నెలలకు వడ్డీ చెల్లించాకే రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పు చేయాల్సిన దుస్థితి వస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణం స్పందించి డిసెంబర్ నుంచి జులై దాకా వడ్డీని తామే భరిస్తామని రైతుల నుంచి వసూలు చేయవద్దని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news