ఒలింపిక్స్ లో 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. తొలి మహిళగా మను బాకర్ రికార్డు

-

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ కొట్టింది. ఆదివారం రోజున తొలి పతకం సాధించింది. భారత యువ షూటర్‌ మను బాకర్‌ 10మీ ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్లో కాంస్య పతకం సాధించింది. ఈ ఒలింపిక్స్లో అరుదైన రికార్డును ఆమె తన ఖాతాలో వేసుకుంది. ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా మను బాకర్ రికార్డు క్రియేట్ చేసింది. ఫైనల్‌లో మను బాకర్‌ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లో భారత్ 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.

ఈ నేపథ్యంలో మను బాకర్పై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ మను బాకర్ను అభినందించారు. ‘పారిస్ ఒలింపిక్స్‌ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్‌ లో కాంస్య పతకంతో దేశానికి పతకాన్ని అందించినందుకు మను బాకర్‌ కు హృదయపూర్వక అభినందనలు. ఆమెను చూసి దేశం గర్విస్తోంది. మను బాకర్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలి’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news