పారిస్ ఒలింపిక్స్ 2024.. ఇజ్రాయెల్ అథ్లెట్లకు బెదిరింపులు

-

పారిస్‌ ఒలింపిక్స్‌ మూడో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ పలు ఈవెంట్లలో క్రీడాకారులు పాల్గొంటున్నారు. అయితే ఒలింపిక్స్ను ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధ ఛాయలు తాకాయి. ఒలింపిక్స్లో పాల్గొన్న ముగ్గురు ఇజ్రాయెల్ అథ్లెట్లను చంపుతామని గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఫ్రాన్స్‌ ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.

పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న తమను చంపుతామని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించినట్లుగా ఇజ్రాయెల్ అథ్లెట్లు ఇటీవల తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా తమపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఇరానియన్‌ హ్యాకర్లు తమ అథ్లెట్లను సైబర్‌ వేధింపులకు గురి చేస్తున్నారని ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి సంబంధించిన రక్త పరీక్షలు, లాగిన్‌ ఆధారాలు మొదలైన డేటా సోషల్‌ మీడియాలో లీక్‌ చేశారని పేర్కొంది. దీనిపై ఫ్రాన్స్‌ ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నట్లు తాజాగా పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. పారిస్‌లో శనివారం జరిగిన ఇజ్రాయెల్-పరాగ్వే ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పరాగ్వే 4-2తో ఇజ్రాయెల్‌ను ఓడించింది. ఆ సమయంలో స్టేడియంలో కొందరు నల్లని దుస్తులు ధరించి, పాలస్తీనా జెండాలు పట్టుకొని నిరసన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news