పీవీ సింధు కోసం మను బాకర్ ఫేక్ ప్రొఫైల్.. ఎందుకంటే?

-

స్వతంత్ర భారతంలో.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా మను బాకర్‌ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే మను కేవలం తన ఆటలోనే కాదు.. మంచి మనసు చాటుకోవడంలో.. తోటి క్రీడాకారులకు తోడుగా నిలవడంలోనూ నెంబర్ వన్. గతంలో రెజర్లపై వేధింపుల విషయంలో వారు ఆందోళనలు చేసిన సమయంలో మనూ బాకర్ వారికి మద్దతుగా నిలిచింది. ఇక మరో సూపర్ స్టార్ ప్లేయర్కు కూడా తన కెరీర్లో డిఫికల్ట్ ఫేజ్లో మనూ తోడుగా నిలిచింది. తాజాగా ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

‘‘భారత క్రీడా చరిత్రలో గొప్ప వారి గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడున్న తరంలో పీవీ సింధు, నీరజ్‌ చోప్రా బాగా తెలుసు. వారి శ్రమను అభినందించలేకుండా ఉండలేం. ఒకదశలో నేను పీవీ సింధు కోసం ఫేక్ ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేశా. కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటంతో.. వారి నుంచి సింధును డిఫెండ్‌ చేయడానికి ఇలా చేశాను. కౌంటర్‌ ఇవ్వడానికి ఫేక్ అకౌంట్‌తో అడ్డుకొనేందుకు ప్రయత్నించా’’ అని మను చెప్పుకొచ్చింది. తాజాగా ఈ అంశంపై పీవీ సింధు స్పందిస్తూ.. ‘‘మంచి మనసుకు ధన్యవాదాలు. రెండు ఒలింపిక్‌ పతకాల క్లబ్‌లోకి మను బాకర్‌కు స్వాగతం. మేం కూడా నీ మార్గంలోనే ఉన్నాం’’ అని పోస్టు పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news