స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిందంటే.. ఉద్యోగం గ్యారంటీ | సీఎం రేవంత్

-

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలన్న గొప్ప ఆశయంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. అభివృద్ధిలో భాగంగా ఇక్కడ మరో నగరాన్ని నిర్మించాలని నిర్ణయించాం. నగరం నిర్మాణం జరగాలంటే, విద్య, వైద్యం, ఉపాధి లాంటి మౌళిక వసతులు కల్పించాలి. అందుకే శాసనసభలో బిల్లును ఆమోదించి ఇక్కడ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం.

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్ లకు శంకుస్థాపన చేసుకున్నాం. స్కిల్ యూనివర్సిటీ ద్వారా లక్షలాది మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ అందించనున్నాం. శిక్షణతో పాటు ఉద్యోగాన్ని ఇచ్చేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయి. స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిందంటే.. ఉద్యోగం గ్యారంటీ. మీ భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఈ ప్రాంతం ఫ్యూచర్ సిటీగా మారబోతుంది.. న్యూయార్క్ నగరం కంటే అధునాతన నగరాన్ని ఇక్కడ నిర్మించబోతున్నాం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news