బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రాజ్ తరుణ్..!

-

గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం హీరో రాజ్ తరుణ్ కేస్. రోజుకో ములుగు తిరుగుతున్న ఈ కేసుకు సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. హీరో రాజ్ తరుణ్ తెలంగాణ హై కోర్టు వద్దకు వెళ్ళాడు. నార్సింగ్ పోలీస్ స్టెదం లో తన పై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసాడు రాజ్ తరుణ్. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసాడని రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదు చేసిన విషయం అందరికి తెలిసిందే. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

దీంతో రాజ్ తరుణ్ హై కోర్టును ఆశ్రయించగా.. రాజ్ తరుణ్ పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. పోలీసుల నుండి ఆదేశాలు తీసుకోవాలని పీపీ కి హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణ రేపటికి వాయిదా వేస్తున్నట్లు హై కోర్టు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news