బంగ్లాదేశ్ లో సైనిక పాలన.. భారత్ కు చేరుకున్న షేక్ హసీనా..?

-

బంగ్లాదేశ్ లో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపు తప్పాయి. ముఖ్యంగా  బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం పోరాడిన ముక్తిజోదాస్ కుటుంబ సభ్యులు 30 శాతం రిజర్వేషన్లు కేటాయించడం అక్కడి యువతకు నచ్చలేదు. 2018లో రిజర్వేషన్ ను రద్దు చేసింది హసీనా ప్రభుత్వం. కోర్టులో పిటీషన్ వేయగా.. 30 శాతం రిజర్వేషన్లు పునరుద్దరిస్తూ తీర్పునిచ్చింది కోర్టు.  దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని షేక్ హసీనా నివాసంలోకి ఆందోళన కారులు చోరబడ్డారు. గేట్లు బద్దలు కొట్టి ప్రధాని నివాసంలోకి వెళ్లి విధ్వంసం సృష్టించినట్టు సమాచారం. 

ప్రధాని పదవీకి రాజీనామా చేసి ప్రత్యేక హెలీకాప్టర్ లో సోదరితో కలిసి దేశాన్ని విడిచి పారిపోయారు  షేక్ హసీనా . ఆమె భారత్ లోని త్రిపుర రాజధాని అగర్తలకు చేరుకున్నట్టు సమాచారం. అగర్తలా నుంచి లండన్ కి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.  మరోవైపు హసీనా తండ్రీ, బంగ్లాదేశ్ తొలి ప్రధాని షేక్ ముజీబుర్ రెమ్మర్ విగ్రహాలను ధ్వం చేశారు. ఈ రెండు రోజుల్లో నిరసన కారుల కారణంగా దాదాపు 300 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. నిరసన కారులను చెదురగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో నిరసన కారులు మరింత రెచ్చి పోయారు. వాహనాలను ధ్వంసం చేశారు. ఇక చివరికీ సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్ ను 5 శాతానికి తగ్గించింది. 2 శాతం రిజర్వ్ చేసింది.  93 శాతం మెరిట్ ఆధారంగా కోటాను కేటాయించింది.

Read more RELATED
Recommended to you

Latest news