మళ్లీ ఎస్పీఎఫ్‌ చేతుల్లోకి సచివాలయం భద్రత!

-

తెలంగాణ రాష్ట్ర సచివాలయ భద్రత మళ్లీ చేతులు మారనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సెక్రటేరియట్ భద్రత మళ్లీ ప్రత్యేక భద్రతా దళం ఎస్పీఎఫ్‌) చేతుల్లోకి వెళ్లనుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక పోలీసు పటాలం(టీజీఎస్పీ) సిబ్బంది ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరి స్థానంలో ఎస్పీఎఫ్‌ను మోహరించే అవకాశం కనిపిస్తోంది.

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ మార్పు అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచీ ఎస్పీఎఫ్‌ సిబ్బందే సచివాలయ భద్రత పర్యవేక్షించిన విషయం తెలిసిందే. కానీ తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయం కూలగొట్టి, కొత్త భవనం నిర్మించిన తర్వాత నుంచి ఈ బాధ్యతస నుంచి వారిని తప్పించి టీజీఎస్పీకి అప్పగించింది. అప్పటి నుంచి ప్రత్యేక పోలీసులే భద్రతా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఎస్పీఎఫ్‌ ఏర్పాటు చేసిందే ఇలాంటి భద్రతా వ్యవహారాల కోసమైనందున టీజీఎస్పీని తొలగించి ఆ స్థానంలో ఎస్పీఎఫ్‌ను నియమించాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news