ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించారు ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై కీలక ప్రకటన చేశారు ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు. త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు.. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. గంజాయి లేని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా మారుస్తామని ప్రకటన చేశారు ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు.