Vastu Tips : ఆర్థిక ఇబ్బందులే లేకుండా ఉండాలా..? ప్రశాంతంగా కూడా ఉండాలా..? అయితే ఈ 5 మస్ట్..!

-

Vastu Tips: ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఆర్థిక ఇబ్బందులే లేకుండా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. మీరు అదే అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ ఐదు పాటించాలి. ఇలా చేశారంటే ఆర్థిక బాధ్యతలు ఉండవు. పైగా జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. మరి అది ఎలానో ఇప్పుడే చూద్దాం. డబ్బులకి సంబంధించిన డాక్యుమెంట్లు, డబ్బులు, విలువైన వాటిని ఈశాన్యం వైపు భద్రపరుచుకోమని వాస్తు పండితులు అంటున్నారు. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే ఇంటి ముఖద్వారం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించకూడదు.

అందుకని ఎప్పుడూ కూడా ఇల్లు ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు ఉండేటట్టు చూసుకోవాలని వాస్తు పండితులు అంటున్నారు. మాస్టర్ బెడ్ రూమ్ ఎప్పుడూ కూడా నైరుతి వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చేయడం వలన మంచి పాజిటివ్ ఎనర్జీ గదిలోకి వస్తుంది. ఎప్పుడు కూడా ఇంట్లో చెత్తాచెదారం లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో విరిగిపోయిన సామాన్లు, పనికిరాని సామాన్లని ఎక్కువగా ఉంచుకోవడం వలన నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దీంతో బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉత్తరం వైపు తెలుపు, ఆకుపచ్చ, బంగారం రంగు పెయింట్లు వేయించుకోవడం మంచిది.

తూర్పు వైపు కూడా ఇదే పాటించడం మంచిది. ముదురు రంగుల కానీ బాగా లైట్ కలర్స్ ని కానీ ఇంటికి వేయించుకోకూడదు. ఇలా జాగ్రత్తలని మీరు తీసుకున్నట్లయితే కచ్చితంగా మీ ఇంట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ప్రశాంతంగా, హాయిగా జీవితాన్ని గడపవచ్చు. ఇబ్బందులు, బాధలు మిమ్మల్ని చుట్టుముట్టవు. హాయిగా జీవించడానికి అవుతుంది. వీలైతే ఇంట్లో ఒక ఎక్వేరియం లేదా వాటర్ ఫౌంటెంట్ ని కూడా ఏర్పాటు చేసుకోండి. ఆఫీసులో కూడా వీటిని పాటించడం మంచిది. ఇలా చేస్తే ఇంట్లో కాని ఆఫీస్లో కాని ఎలాంటి సమస్యలు ఉండవు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులే ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news